Site icon HashtagU Telugu

Nayanatara New Business : నయనతార కొత్త బిజినెస్.. ఏ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారో తెలుసా ?

Nayanthara

Nayanthara

Nayanatara New Business : లేడీ సూపర్ స్టార్ నయనతార  కొత్త బిజినెస్ కు శ్రీకారం చుట్టారు. తన భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి చర్మ సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. తమ ప్రోడక్ట్ కు ‘9స్కిన్’ అని పేరు పెట్టారు. ఈవిషయాన్ని ట్విట్టర్ వేదికగా నయన్ భర్త విఘ్నేశ్‌ శివన్‌  వెల్లడించారు. 9స్కిన్ పేరుతో తమ స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘మా వ్యాపార సంస్థకు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా 9SkinOfficialను గర్వంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే సెల్ఫ్‌ లవ్‌ ఎంతో ముఖ్యమని మేము నమ్మాం. ఈ నెల 29 నుంచి వ్యాపారంలో మా ప్రయాణం మొదలు కానుంది. ఆ రోజు నుంచి స్కిన్‌ కేర్‌కు సంబంధించిన ప్రోడక్ట్స్  ను మీరు మా అధికారిక సైట్‌లో కొనొచ్చు’’ అని తెలిపారు.

Also read : Tollywood : తెలుగు హీరోలను చూస్తే సిగ్గేస్తుంది -జేసీ సంచలన వ్యాఖ్యలు

గతంలోకి వెళితే.. నయన్ ఇంతకుముందు ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ రెనిటా రాజన్‌తో కలిసి లిప్‌బాల్మ్ కంపెనీని ప్రారంభించారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘9స్కిన్’ ను ప్రారంభించారని తెలుస్తోంది.  సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తారలు ఇప్పటికే వ్యాపార రంగంలోకి వచ్చారు. హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఫిట్‌నెస్‌ సెంటర్లు ఉండగా.. ‘సాకీ’ అనే బ్రాండ్‌తో దుస్తుల వ్యాపారంలోకి సమంత (Nayanatara New Business)  అడుగుపెట్టారు. శిల్పాశెట్టికి స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్, కత్రినాకైఫ్‌కు మేకప్‌ ప్రొడెక్ట్స్‌ బిజినెస్‌ ఉన్నాయి.