Air India Plane Crash : ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

Air India Plane Crash : అనూహ్యంగా ఏర్పడిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడినప్పటికీ, సినిమాపై ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదని చిత్రబృందం స్పష్టం చేసింది

Published By: HashtagU Telugu Desk
Kubera Movie

Kubera Movie

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ఈరోజు (జూన్ 13) జరగాల్సిన ‘కుబేర’ (Kubeera) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నిర్ణయం బాధితులకు అండగా నిలబడే సంకేతంగా తీసుకోవాలని మేకర్స్ తెలియజేశారు.

Finn Allen: టీ20ల్లో స‌రికొత్త రికార్డు.. 19 సిక్సులతో విధ్వంసం, ఎవ‌రీ ఐపీఎల్ అన్‌సోల్డ్ ఆట‌గాడు!

ఈవెంట్‌ను జూన్ 15న (ఆదివారం) హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Shreyas Iyer: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు మ‌రోసారి హార్ట్ బ్రేకింగ్‌.. 10 రోజుల వ్య‌వ‌ధిలో రెండో క‌ప్ మిస్‌!

‘కుబేర’ సినిమా జూన్ 20న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూహ్యంగా ఏర్పడిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడినప్పటికీ, సినిమాపై ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదని చిత్రబృందం స్పష్టం చేసింది. బాధితుల కుటుంబాలకు గౌరవంగా ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేయడం ద్వారా సినిమాటిక్ ఫ్రటర్నిటీ తమ బాధ్యతను చాటుకున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  Last Updated: 13 Jun 2025, 02:22 PM IST