Kriti Sanon-Prabhas: ప్రభాస్ ఈజ్ మై డార్లింగ్, స్వీట్ హార్ట్ : కృతి సనన్

ప్రభాస్ నిజంగా డార్లింగ్, స్వీట్ హార్ట్ అని బాలీవుడ్ బ్యూటీ Kriti Sanon ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Kriti Sanon

Kriti Sanon

ఆదిపురుష్ (Adipurush) సినిమా ఎప్పుడైతే మొదలైందో, అప్పట్నుంచే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మధ్య డేటింగ్ పుకార్లు వినిపించాయి. డేటింగ్ వార్తలపై  కృతి సనన్ (Kriti Sanon) స్పందించినప్పటికీ రూమర్స్ కు చెక్ పడలేదు. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతి వేదికగా జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో అందరి కల్లు సీత అయిన కృతి సనన్ పై పడ్డాయి. తాను ప్రభాస్ గురించి ఏం మాట్లాడుబోతుందో? అని అభిమానులు ఆసక్తి నెలకొంది.

ప్రిరిలీజ్ వేడుకలో కృతి సనన్ మాట్లాడుతూ “అందరికీ నమస్తే. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభించాను. తొమ్మిదేళ్ల తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చాను. ఆదిపురుష్ మూవీ నాకు చాలా స్పెషల్. కెరీర్‌లో చాలా తక్కువ మంది నటీనటులు ఇలాంటి పాత్రలను పోషిస్తారు. అందరి ప్రేమకు ధన్యవాదాలు. జానకిగా (Janaki) నన్ను సెలక్ట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జూన్ 16న థియేటర్లలోకి వస్తున్నాం, మీ అందరి ఆశీస్సులు కావాలి అని కృతి సనన్ అన్నారు.

ప్రభాస్ (Prabhas) ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉన్నాడు అని ప్రదీప్ ప్రశ్నించగా.. కృతి బదులిస్తూ.. “ప్రభాస్ ఎక్కువగా మాట్లాడరని విన్నాను. కానీ అది నిజం కాదు. చాలా మాట్లాడతాడు. అతను నిజంగా డార్లింగ్, స్వీట్ హార్ట్. ప్రభాస్ చాలా హార్డ్ వర్కర్. అతని కళ్లలోని స్వచ్ఛత చూస్తుంటే ఈ సినిమాలో రాముడి పాత్రను మరెవరూ చేయగలరని నేను అనుకోను” అని ఆమె తన మనసులోని మాటలను బయటపెట్టింది. ఇక ప్రిరిలీజ్ వేడుకలో ప్రభాస్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని అభిమానులతో చెప్పడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Adipurush: తిరుమల సన్నిధిలో ముద్దులు.. ఓంరౌత్, కృతి సనన్ పై విమర్శలు!

  Last Updated: 07 Jun 2023, 12:33 PM IST