Krish Jagarlamudi : మొన్న కంగనా.. నేడు పవన్ సినిమా.. మధ్యలోనే వదిలేస్తున్న దర్శకుడు..

మొన్న కంగనా, నేడు పవన్ కళ్యాణ్ సినిమాని మధ్యలోనే వదిలేస్తున్న దర్శకుడు క్రిష్. అప్పుడు కారణం విబేధాలు, మరి ఇప్పుడేంటి..?

Published By: HashtagU Telugu Desk
Krish Jagarlamudi Hand Over Pawan Kalyan Hari Hara Veera Mallu To Jyothi Krishna

Krish Jagarlamudi Hand Over Pawan Kalyan Hari Hara Veera Mallu To Jyothi Krishna

Krish Jagarlamudi : గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో టాలీవుడ్ మంచి పేరుని సంపాదించుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. ఈమధ్య కాలంలో దర్శకుడిగా కొన్ని సినిమాలను స్టార్ట్ చేసి, ఆ తరువాత ఆ ప్రాజెక్ట్స్ ని మధ్యలోనే వదిలేసి బయటకి వచ్చేస్తున్నారు. బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రం క్రిష్ దర్శకత్వంలోనే మొదలయింది. కానీ ఆ తరువాత క్రిష్ తప్పుకోవడంతో.. కంగనా బ్యాలన్స్ షూట్ ని డైరెక్ట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

ఆ మూవీ విషయంలో కంగనా అండ్ క్రిష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమే కారణం. అయితే ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా క్రిష్ తప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ వారియర్ మూవీ.. మొఘలులు కాలం నాటి కథతో తెరకెక్కుతుంది. 2020లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారు. కానీ పవన్ పొలిటికల్ ప్రచారాలు వల్ల షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.

ఇక ఈ ఆలస్యంతో ఈ మధ్యలో ‘కొండ పొలం’ అనే ఓ సినిమాని డైరెక్ట్ చేసి క్రిష్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. కానీ ఈ నాలుగేళ్లలో క్రిష్ తన ఎక్కువ ఫోకస్ వీరమల్లు పైనే పెట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో క్రిష్ మరో ఏడాది పాటు ఈ సినిమా పై సమయం కేటాయించాల్సి ఉంటుంది. దీని వల్ల క్రిష్ ప్రైమ్ టైం అంతా వేస్ట్ అవుతుండడంతో.. చేసేది లేక క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

వీరమల్లు దర్శకత్వ భాద్యతలను డైరెక్టర్ జ్యోతి కృష్ణకి అప్పగించి క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు. వీరమల్లుని నిర్మిస్తున్న ఏ ఎం రత్నం కుమారుడే జ్యోతికృష్ణ. ఈయన కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేసారు. నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసారు. ఇప్పుడు హరిహర వీరమల్లు బ్యాలన్స్ షూట్ ని క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మరి జ్యోతికృష్ణ ఈ భారీ భాద్యతని ఎలా నిర్వర్తిస్తారో చూడాలి.

Also read : Pawan Kalyan : ప్రచారంలో ఆట..పాటలతో హుషారు తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్

  Last Updated: 02 May 2024, 11:55 AM IST