Kota Rukmini: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆయన భార్య రుక్మిణి అనారోగ్య కారణాలతో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి గత కొద్ది రోజులుగా విషమించిందని, చివరికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రుక్మిణి అంత్యక్రియలు ఇప్పటికే హైదరాబాద్‌లో నిర్విరామంగా పూర్తి చేసినట్లు సమాచారం.
రుక్మిణి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. భర్త కోట శ్రీనివాసరావు సినీ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె అనారోగ్యం కారణంగా కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కోట శ్రీనివాసరావు బ్రతికున్న రోజుల నుంచే రుక్మిణి ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉండేవని సన్నిహితులు చెబుతున్నారు. 1973లో రుక్మిణి ప్రసవవేదనలో ఉండగా, ఆమె తల్లి ఆకస్మికంగా మరణించారు. ఆ సంఘటన రుక్మిణి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ షాక్ నుండి బయటపడలేకపోయిన ఆమె, మానసిక సమస్యలతో బాధపడుతూ, దాదాపు 30 సంవత్సరాల పాటు ఎవరినీ సరిగా గుర్తుపట్టలేని స్థితిలో జీవించారు. ఈ కుటుంబ సమస్యను బయటకు వెల్లడించకుండా, ఎంతో మౌనంగా మోయారని కోట సన్నిహితులు చెబుతున్నారు.
Poco : బడ్జెట్ ఫ్రెండ్లీ.. అతి తక్కువ ధరకే బెస్ట్ POCO స్మార్ట్‌ఫోన్స్..చెక్ చేయండి
రుక్మిణి, కోట శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే 2010లో కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం కుటుంబానికి తీరని విషాదంగా మారింది. ఆ దెబ్బ నుండి బయటపడకముందే, తాజాగా రుక్మిణి మరణించడం కోట కుటుంబానికి మరో గట్టి దెబ్బగా మారింది. తన భార్య రుక్మిణి మానసిక సమస్యలు, కుటుంబంలో ఎదురైన కష్టాలను ఎప్పుడూ బయట పెట్టని కోట శ్రీనివాసరావు, సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎప్పుడూ హాస్యం, ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అంతర్గతంగా ఎన్నో కష్టాలతో నిండిపోయింది. రుక్మిణి మరణంతో సినీ వర్గాలు, సన్నిహితులు కోట కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.
Deputy CM Bhatti: సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి