దేవర సక్సెస్ తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన కొరటాల శివ దేవర 2 కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఐతే దేవర 1 లోనే పార్ట్ 2 కి సంబందించిన కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఐతే ఎన్టీఆర్ దేవర 2 కి డేట్స్ ఇస్తే షూట్ చేయాలని చూస్తున్నాడు. ఐతే ఈలోగా దేవర 2(Devara) తర్వాత కొరటాల శివ చేయబోతున్న సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కొరటాల శివ స్టార్ తనయుడితో సినిమా చేయబోతున్నాడని టాక్.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) ఇప్పటికే అక్కడ వెరైటీ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అతను చేసిన హృదయం సినిమాకు సౌత్ ఆడియన్స్ అంతా సూపర్ ఫిదా అయ్యారు. ఐతే ప్రణవ్ కూడా తెలుగు సినిమాల మీద ఆసక్తి ఉన్నట్టు తెలుసుకున్న కొరటాల శివ (Koratala Siva) అతని కోసం ఒక కత సిద్ధం చేశాడని తెలుస్తుంది.
కొరటాల శివతో జనతా గ్యారేజ్..
ఆల్రెడీ కొరటాల శివతో జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పనిచేశారు. ఆ పరిచయం కొద్దీ ప్రణవ్ తో కొరటాల శివ చేసే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తుంది. దాదాపు కథ ఓకే అయ్యిందని తెలుస్తుండగా త్వరలోనే దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది.
ఎన్టీఆర్ (NTR) దేవర 2 పూర్తి కాగానే ఈ సినిమా మొదలు పెడతారా ఈలోగానే ఈ సినిమా చేస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా టాలీవుడ్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది.
Also Read : NTR Devara : దేవర ఓటీటీ టాక్ ఏంటి..?