Komatireddy Venkat Reddy : పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రాగ అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. ఆమె బాబు కూడా కోమాలోకి వెళ్లడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. నిన్న అసెంబ్లీలో ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి అల్లుఅర్జున్, సినీ పరిశ్రమ పై ఫైర్ అయ్యారు.
దీనికి కౌంటర్ గా నిన్న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు. నిన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాస్పిటల్ లో ఉన్న ఆ బాలుడిని కలిసి ఈ ఘటనపై మీడియాతో మాట్లాడాడు. ఇకపై సినిమాలకు టికెట్ పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ తో పాటు కోమటిరెడ్డి కూడా స్పష్టం చేసారు. తాజాగా నేడు ఉదయం మరోసారి ఈ ఘటన గురించి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. మంత్రిగా చెబుతున్నాను ఇకపై బెన్ ఫిట్ షోలు ఉండవు. ఎక్స్ ట్రా రేట్లు ఉండవు. హై బడ్జెట్ అయినా, లో బడ్జెట్ పెట్టుకున్నా మాకు సంబంధం లేదు. ఏదైనా చారిత్రక, స్వతంత్ర పోరాటం, తెలంగాణ గురించి సినిమాలుంటే మాత్రం ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీతో సమావేశం అవుతాము. ఇండస్ట్రీ అంటే ప్రభుత్వానికి ప్రేమ ఉంది అని అన్నారు.
ఇక అల్లు అర్జున్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఇంత జరిగినా తను తప్పు చేయలేదు అని అల్లు అర్జున్ అనడం సరికాదు. సీఎం అసెంబ్లీలో మాట్లాడింది అబద్దమా..? పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు, దాన్ని కూడా అల్లు అర్జున్ తప్పు పడతావా, అల్లు అర్జున్ కు లీగల్ వాళ్లు ఎందుకు చెబుతారు వెళ్ళొద్దని. ప్రాణం పోయాక మళ్లీ రాదు అల్లు అర్జున్ గుర్తుంచుకోవాలి. అల్లు అర్జున్ అనుమతి లేకుండా రావడమే తప్పు. ప్రాణం పోయినా ఆ తల్లి కొడుకు చేయి వదల్లేదు. ఇవన్నీ అల్లు అర్జున్ కు తెలిసినా హీరో బయటికి వెళ్ళలేదు. రేవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ రేవతి కుటుంబాన్ని చేస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రేవతి భర్తకు లివర్ ట్రాన్స్ ప్లాంట్ అయ్యింది. వారి పిల్లలను ప్రతీక్ ఫౌండేషన్ ఆదుకుంటుంది. సీఎం వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుపట్టడం సరికాదు. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలి. అల్లు అర్జున్ చేయి ఊపుతూ వచ్చింది, వెళ్లింది నిజం. మనిషి చనిపోతే కూడా వెళ్ళొద్దు అంటారా..? ప్రాణం అంటే లెక్కలేదా? హీరోలు ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవాలి అని సీరియస్ అయ్యారు.
Also Read : Congress Leaders Reaction: అల్లు అర్జున్ యాక్షన్.. కాంగ్రెస్ నాయకుల రియాక్షన్ ఇదే!