Site icon HashtagU Telugu

Knee Surgery : చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడా..?

Knee Surgery To Chiranjeevi

Knee Surgery To Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్న చిరంజీవి ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. 25 ఏళ్ల కుర్రాడిలా వరుస సినిమాలు చేస్తూ..యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ..వరుస షూటింగ్ లతో బిజీ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన మోకాళ్ళ నొప్పులు ఎక్కువై పోతున్నాయి. గత కొంతకాలంగా చిరంజీవి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.

ఇక ఇప్పుడు ఆ నొప్పులు ఎక్కువ అవ్వడంతో సర్జరీ (Knee Surgery) చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. మరో వారం రోజుల్లో ఈ సర్జరీ చేయించుకోబోతున్నాడట. హైదరాబాద్ లో చేయించుకుంటాడా..లేక విదేశాల్లో చేసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ సర్జరీ చేసుకుంటే మాత్రం దాదాపు మూడు నెలల పాటు రిస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సినిమాలకు మూడు నెలల వరకు బ్రేక్ పడినట్లే.

వాల్తేరు వీరయ్య మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవికి భోళా శంకర్ (Bhola Shankar) పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడనంత డిజాస్టర్ గా భోళా శంకర్ నిలిచింది. రెండో రోజుకే భోళా శంకర్ వసూళ్లు పడిపోయాయి. దర్శకుడు మెహర్ రమేష్ అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో నిరాశపరిచాడు. భోళా శంకర్ రీమేక్ కాగా చిరంజీవి ఇకపై రీమేక్స్ చేయకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం అభిమానులు వెల్లడిస్తున్నారు.

కాగా నెక్స్ట్ చిరంజీవి సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారట. ఈ మూవీలో మరో హీరో శర్వానంద్ నటిస్తున్నారని సమాచారం. ఇది మలయాళ హిట్ బ్రో డాడీ రీమేక్ అనే మాట వినిపిస్తోంది. ఈ మూవీ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించనున్నారు.

Read Also :  Operation Valentine : వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ వచ్చేసింది