Site icon HashtagU Telugu

KK Senthil Kumar : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి మృతి

Kk Senthil Kumar Wife

Kk Senthil Kumar Wife

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (Cinematographer) సెంథిల్ కుమార్ (KK Senthil Kumar) భార్య రూహి (Ruhee ) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో (Health Related Issues) బాధపడుతున్న ఈమె హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ..ఈరోజు తుది శ్వాస విడిచారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి రూహీ పార్థీవదేహాన్ని తమ నివాసానికి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు తరలించారు. ఆమె అంత్యక్రియులు శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి అని పేర్కొన్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర చాలా కాలం పాటు ఆమె పని చేశారు. రూహీ మరణ వార్త తెలిసి రాజమౌళి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఇక సెంథిల్ కుమార్ విషయానికి వస్తే..

We’re now on WhatsApp. Click to Join.

1999 లో విదుదలైన ప్రేమకు వేళాయెరా చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. టెలివిజన్ సీరియల్ అమృతం లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది. 2003లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఐతే ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా ఎస్. ఎస్. రాజమౌళి తన సినిమా సైలో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు. సై (2004), ఛత్రపతి (2005), యమదొంగ (2007), మగధీర (2009), ఈగ (2012), బాహుబలి:ద బిగినింగ్ (2015) లలో పనిచేసాడు. 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన ఈగ సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది. జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.

Read Also : Chiranjeevi Pawan Kalyan : చిరంజీవి పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఫైట్..?