పబ్లిక్ గా సాయి పల్లవి కి ముద్దు పెట్టి అభిమాని షాక్ ఇచ్చారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సాయి పల్లవి (Sai Pallavi). తన సహజమైన అభినయం, ప్రత్యేకమైన నటనా శైలి, ప్రతిభతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ గ్లామర్ హీరోయిన్‌లా కాకుండా, కథకు ప్రాధాన్యతనిచ్చే, సుదీర్ఘమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరికీ సహజత్వం, ఎమోషనల్ కనెక్షన్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించక మానదు.
Fact Check : రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి వేడుక.. మీడియా నివేదికలన్నీ తప్పుల తడకలే
సాయి పల్లవి కెరీర్ ప్రారంభంలోనే తన విలక్షణతను నిరూపించుకుంది. ‘ప్రేమమ్’ సినిమాతో పరిచయమైన ఆమె, తొలి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఫిదా’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించి, తన స్థాయిని మరింత పెంచుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా, పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నో చెప్పే ధైర్యం సాయి పల్లవిలో ఉంది. ఇటీవల ఆమె నటించిన ‘అమరన్’, ‘తండేల్’ చిత్రాల్లో కూడా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రతిసారీ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని, వాటిని తనదైన శైలిలో పోషిస్తూ ప్రేక్షకుల చేత హర్షధ్వానాలు అందుకుంటున్న సాయి పల్లవి కి ఓ అభిమాని షాక్ ఇచ్చాడు.
తాజాగా తండేల్ సినిమా సక్సెస్ మీట్ లో ఓ మహిళా అభిమాని సాయిపల్లవి దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇస్తూ ఆమె చేతిపై ముద్దు పెట్టింది. దీంతో తెగ సంతోష పడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అటు సాయి పల్లవి సైతం హ్యాపీగానే కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
❤️🔥🧎🏻♂️😋 pic.twitter.com/1IFhJl5LH0
— SHANMUKH (@Shanmukh_008) February 15, 2025