బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri ) ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ‘భైరవం’ తర్వాత సాయి శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఆయన చాలా నమ్మకంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
India vs UAE: 57 పరుగులకే కుప్పకూలిన యూఏఈ!
ఈ సినిమా ప్రీమియర్ షోను నిన్న రాత్రి హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా మొదలైన మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ, కథ కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి ప్రవేశించిన తర్వాత సినిమా వేగం పుంజుకుందని ప్రేక్షకులు చెబుతున్నారు. దర్శకుడు ఫస్ట్ హాఫ్ ను ఎలాంటి అదనపు హంగులు లేకుండా, అనుకున్న పాయింట్‌ను తెరపై చాలా చక్కగా చూపించాడని ప్రశంసించారు. సెకండ్ హాఫ్ కూడా అదే గ్రిప్పింగ్‌తో హారర్ ఎలిమెంట్స్‌ని ఏ మాత్రం తగ్గించకుండా అద్భుతంగా ఉందని అంటున్నారు.
సినిమాలో నటీనటుల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా, తమిళ నటుడు శాండ నటన ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించిందని, అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్‌లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పవచ్చు. థ్రిల్లర్ ఎపిసోడ్స్, స్టోరీ నెరేషన్ చాలా బాగున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన సౌండ్ డిజైన్. హారర్ సినిమాకు సౌండ్‌తో ఎంత మ్యాజిక్ చేయవచ్చో అంత చేశారని ప్రశంసలు దక్కాయి. మొత్తంమీద, ‘కిష్కింధపురి’ సినిమా మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి అలరిస్తుందని, చివరిలో పార్ట్ 2 కోసం ఇచ్చిన ట్విస్ట్ చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.