యువ హీరోల్లో హిట్లు ఫ్లాపులను సమతూకం వేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram Ka). వెంట వెంట రెండు ఫ్లాపులు పడే సరికి కిరణ్ కెరీర్ కాస్త డైలమాలో పడింది. అందుకే ఈసారి నెక్స్ట్ సినిమా ఒక రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే ఒక పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సుజిత్, సందీప్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్న క సినిమాలో కిర్ణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఆ టీజర్ వల్లే సినిమా ఒక రేంజ్ బిజినెస్ (Ka Movie Business) జరిగిందని తెలుస్తుంది. శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న క సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రెండు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. థియేట్రికల్ రైట్స్ మొత్తం ఒక్కరే తీసుకున్నారట. 13 కోట్లతో కిరణ్ అబ్బవరం సినిమా థియేట్రికల్ బిజినెస్ లాక్ చేసుకున్నారు.
ఇక మరోపక్క నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలికినట్టు తెలుస్తుంది. క సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 8 కోట్ల దాకా డిమాండ్ చేసిందట. సో ఇలా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రెండు కలిసి 21 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఫ్లాపుల్లో ఉన్నా కూడా కిరణ్ సినిమాలకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు.
క సినిమా విషయంలో కిరణ్ చాలా కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్నడు. ఈ సినిమా కూడా టైం ట్రావెల్ కి సంబందించిన కథతో వస్తుందని టాక్. ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా ప్రాజెక్ట్ తో కిరణ్ పాన్ ఇండియా (PAN India) లెవెల్ లో సత్తా చాటేలా ఉన్నాడని అనిపిస్తుంది.
Also Read : Nabha Natesh : ఆ హీరోయిన్ కి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు..!
