Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. కిరణ్ కెరీర్లోనే ఈ కలెక్షన్స్ హైయెస్ట్. దీంతో కిరణ్ ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. ఊహించనంత పెద్ద హిట్ అవ్వడంతో క టీమ్ కూడా ఫుల్ జోష్ మీదున్నారు. తాజాగా నిన్న సక్సెస్ మీట్ కూడా పెట్టారు.
అయితే కిరణ్ అబ్బవరం క సక్సెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత మంచి జరుగుతుందని అంటారు. కానీ మరీ ఇంత మంచి జరుగుతుందని నాకు తెలీదు. ఎవరైనా సక్సెస్ కాకపోతే త్వరగా పెళ్లి చేసుకోండి సక్సెస్ వస్తుంది అని అన్నాడు. దీంతో కిరణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కిరణ్ అబ్బవరం ఇటీవలే తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సినిమా క పెద్ద హిట్ అవ్వడంతో ఈ సక్సెస్ క్రెడిట్ భార్యకు ఇవ్వడం గమనార్హం.
ఇక క సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కర్మ సిద్ధాంతం పాయింట్ ని జత చేసి ఓ కొత్త క్లైమాక్స్ తో ఎవరూ ఊహించని విధంగా చూపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తున్న. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని క2 వరం రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు మూవీ యూనిట్.
Also Read : Balakrishna : బాలకృష్ణ కోసం 3 టైటిల్స్.. బాబీ ప్లానింగ్ అదుర్స్..!