Site icon HashtagU Telugu

Kingdom Talk : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్

Vijay Devarakonda Kingdom T

Vijay Devarakonda Kingdom T

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్‌డమ్ (Kingdom ) మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని విజయ్..ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నాడు. ఈయన మాత్రమే కాదు హీరోయిన్ , మ్యూజిక్ డైరెక్టర్ , నిర్మాత ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకొని పబ్లిక్ ఏమంటారా అనేది తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.

ఇక అర్ధరాత్రి నుండే అమెరికా లో షోస్ మొదలవ్వగా..తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల ఆట తో సందడి మొదలైంది. అమెరికాలో షోస్ చుసిన వారు వారి స్పందనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ టాక్ ని బట్టి టైటిల్ కార్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది. మంచి ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది.

Tariff: 25 శాతం టారిఫ్.. భార‌త ప్ర‌భుత్వం తొలి స్పంద‌న ఇదే!

సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చాడని, అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్స్, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుందని అంటున్నారు. సత్యదేవ్, భాగ్యశ్రీ తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందని ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు. జైలు సీన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అని పేర్కొన్నారు. గౌతమ్ తిన్ననూరి మంచి కథను రాసుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎమోషన్స్ తో పాటుగా యాక్షన్ కూడా బ్యాలన్సుడ్ గా హ్యాండిల్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. చాలా సన్నివేశాలను తనం బీజీఎమ్ తో ఎలివేట్ చేసాడు. సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని అంటున్నారు. కాకపోతే సెకండాఫ్ ఫ్లాట్ గా సాగిందని, ఎలివేషన్స్ తగ్గాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ నడుస్తుంది. పూర్తి రివ్యూస్ పడితే కానీ సినిమా ఫలితం ఏంటి అనేది తెలియదు.