Site icon HashtagU Telugu

Kingdom : ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ మారింది

Kingdom Release Date

Kingdom Release Date

యూత్‌స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom ). ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తొలుత మేకర్స్ మే 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రకటించినా, అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా జూలై 4న సినిమా విడుదల కాబోతుందని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక పోస్టర్‌తోపాటు ప్రకటనను రిలీజ్ చేశారు.

Hyderabad : ఐటీ కారిడార్‌కు దగ్గరగా అతి తక్కువ ధరలో ఫ్లాట్స్..ఎక్కడో తెలుసా..?

ఇటీవల దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రమోషన్లు, ఈవెంట్లు నిర్వహించడం కష్టంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విడుదల తేదీ మార్చినా, సినిమా స్థాయిలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదని స్పష్టం చేశారు. ‘కింగ్‌డమ్’ సినిమాను మరింత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, జూలై 4న థియేటర్లలో విడుదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది. దీనికి మద్దతుగా నిలిచిన దిల్ రాజు, నితిన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు విశేష స్పందన లభించింది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ‘జెర్సీ’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నాడు. తొలి పాట ‘హృదయం లోపల’ ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల విజయ్‌కు సరైన హిట్ లేకపోవడంతో, ‘కింగ్‌డమ్’పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.