Kiara Advani : తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలతో మెప్పించింది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. 2023 లో బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న కియారా ఇటీవల కొన్ని రోజుల క్రితం తన ప్రగ్నెన్సీని ప్రకటించింది. దీంతో కియారా – సిద్దార్థ్ అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
అప్పుడప్పుడు కియారా బయట కనపడినప్పుడు మీడియాకు చిక్కితే ఫోటోలు బయటకు రావడమే తప్ప ఇప్పటివరకు కియారా అధికారికంగా బేబీ బంప్ ఫోటోలు షేర్ చేయలేదు. తాజాగా కియారా న్యూయార్క్ లో జరుగుతున్న మెట్ గాలా ఈవెంట్ లో బేబీ బంప్ తో అందమైన డ్రెస్ లో మెరిపిస్తూ కనిపించింది. ఆ ఈవెంట్లో బేబీ బంప్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో మెట్ గాలా ఈవెంట్లో బేబీ బంప్ తో పాల్గొన్న మొదటి ఇండియన్ నటిగా కియారా అద్వానీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఈవెంట్లో మన ఇండియా నుంచి కూడా అనేకమంది హీరోయిన్స్, హీరోలు పాల్గొంటారు. కియారా ఇలా బేబీ బంప్ తో పాల్గొనడంతో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Jagadeka Veerudu Athiloka Sundari : చిరంజీవి తో సమానంగా శ్రీదేవి రెమ్యూనరేషన్..!!