Kiara Advani : యష్ టాక్సిక్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అమ్మడి ఖాతాలో మరో లక్కీ ప్రాజెక్ట్..!

Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు చెక్ పెడుతూ ఒకదానికి మించి మరొక చాన్స్ అందుకుంటూ వస్తుంది అందాల భామ కియరా అద్వాని.

Published By: HashtagU Telugu Desk
2025 Kiara Advani Come with Three Crzy Projects

2025 Kiara Advani Come with Three Crzy Projects

Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు చెక్ పెడుతూ ఒకదానికి మించి మరొక చాన్స్ అందుకుంటూ వస్తుంది అందాల భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అంటోల్డ్ స్టోరీ తో పాపులర్ అయిన ఈ అమ్మడు వరుస సినిమాలతో తన సత్తా చాటుతూ వస్తుంది. బాలీవుడ్ లో చేస్తూనే సౌత్ లో కూడా అలరిస్తుంది. తెలుగులో భరత్ అనే నేను సినిమా చేసిన అమ్మడు ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది.

ప్రస్తుతం రాం చరణ్ గేం చేంజర్ లో కూడా కియరా నటిస్తుంది. బాలీవుడ్ లో ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తున్న కియరా వార్ 2, డాన్ 3 సినిమాల్లో కూడా అవకాశం అందుకుందని తెలిసిందే. అమ్మడు లేటెస్ట్ గా కె.జి.ఎఫ్ హీరో యష్ చేసున్న టాక్సిక్ సినిమాలో కూడా నటిస్తుందని టాక్.

కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించిన యష్ ఆ సినిమా తర్వాత చేస్తున్న టాక్సిక్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా ఎంపికైనట్టు తెలుస్తుంది. తప్పకుండా అమ్మడు ఈ సినిమాకు మరింత క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు.

కియరా అద్వాని పెళ్లైనా సరే తన దూకుడు తగ్గించట్లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో తన సత్తా చాటుతుంది. ఇదే ఫాం కొనసాగిస్తే మరో ఐదారేళ్లు కియరాకి తిరిగు ఉండదని చెప్పొచ్చు.

Also Read : Nani : నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట.. మరో నిర్మాత చేతిలోకి..

  Last Updated: 16 May 2024, 06:37 PM IST