బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా (Kiara Advani, Sidharth Malhotra ) తల్లిదండ్రులుగా మారారు. ముంబైలోని HN రిలయన్స్ ఆస్పత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు (Blessed with Baby Girl)జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ సంతోషకరమైన వార్తను తెలుసుకున్న వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్దార్థ్ – కియారా దంపతులకు ఇది జీవితంలో ఓ కొత్త అధ్యాయం.
కియారా 2023లో సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమ పెళ్లి చేసుకొని, తల్లిగా మారడం విశేషం. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లికి మొగ్గుచూపిన కియారా, తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతూ తన ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. గతేడాది చివర్లో గర్భవతినని ప్రకటించిన కియారా, ఇప్పుడు ఓ క్యూట్ బేబీ గర్ల్ తల్లిగా మారింది. ఆమె ఈ సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Social Media : ” రీల్స్ మానేయ్యండి..న్యూస్‌పేపర్లు చదవండి” యువతకు అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచనలు
తెలుగు ప్రేక్షకులకు కియారా అద్వానీ మంచి గుర్తింపు ఉన్న నటి. “భరత్ అనే నేను” సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కియారా, అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తర్వాత చేసిన “వినయ విధేయ రామ” మరియు “గేమ్ ఛేంజర్” సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. టాలీవుడ్‌లో ప్లాప్‌లు ఎదురైనా, బాలీవుడ్‌లో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.
ప్రస్తుతం కియారా “వార్ 2” అనే భారీ ప్రాజెక్టులో నటిస్తుండగా, సిద్దార్థ్ మల్హోత్రా “పరమ సుందరి” అనే చిత్రంలో నటిస్తున్నారు. కుటుంబ జీవితంలో ఈ కొత్త బాధ్యతలతో పాటు, వారి ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ బిజీగా ఉన్న ఈ జంట, బాలీవుడ్‌లో ప్రేక్షకుల మద్దతుతో ముందుకు సాగుతున్నారు.