Kiara Advani బాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకెళ్తున్న కియరా అద్వాని పెళ్లితో ఎంతోమంది ఆమె అభిమానుల హృదయాలను కొల్లగొట్టినా సరే పెళ్లి తర్వాత కూడా తన దూకుడు ఏమాత్రం తగ్గించనందుకు సతోషంగా ఉన్నారు. బాలీవుడ్ లో స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేస్తున్న కియరా అద్వాని ఇటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. రాం చరణ్ తో ఆల్రెడీ వినయ విధేయ రామ సినిమా చేసిన కియరా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేం చేంజర్ సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
బాలీవుడ్ లో ఆల్రెడీ అమ్మడు వరుస సినిమాలు చేస్తుండగా లేటెస్ట్ గా డాన్ 3 లో ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. షారుఖ్ ఖాన్ నటించిన డాన్ 1, 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టాయి. ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్ లో తెరకెక్కిన డాన్ రెండు సినిమాలను రితేష్ సిధ్వాని నిర్మించారు. అయితే డాన్ ఫ్రాంచైజ్ నుంచి షారుఖ్ ఖాన్ బయటకు వెళ్లగా డాన్ 3 లో ఆ లక్కీ ఛాన్స్ మరో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ అందుకున్నాడు.
డాన్ 3 లో రణ్ వీర్ సింగ్ తో కియరా అద్వాని జత కడుతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై బీ టౌన్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కియరా అద్వాని కెరీర్ లో ఇదొక క్రేజీ ఛాన్స్ అని చెప్పొచ్చు. పెళ్లైనా సరే కెరీర్ విషయంలో ఏమాత్రం క్రేజ్ తగ్గని దీపిక పదుకొనె లానే కియరా అద్వాని కూడా వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తుంది.
Also Read : Kalki 2898AD Kamal Hassan Remuneration : కల్కి కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..?