Site icon HashtagU Telugu

Khushbu Sundar: ఖుష్బూ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

Kushubu

Kushubu

ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర తారలతో కలిసి పనిచేసిన నటికి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమె జ్వరం (Fever), శరీర నొప్పి లక్షణాలతో బాధపడుతోంది. తాజాగా తీవ్ర జ్వరం, బలహీనతతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. ఖుష్బూ (Khushbu Sundar) ఆసుపత్రి నుండి ఫోటోలను కూడా పంచుకున్నారు. తన అనారోగ్యం గురించి ఆందోళన చెందవద్దు అంటూ అభిమానులకు సూచించింది.

“నేను చెప్పినట్లు, ఫ్లూ చాలా చెడ్డది. ఇది నాపై ప్రభావం చూపింది. చాలా తీవ్రమైన జ్వరం, శరీర నొప్పి, బలహీనతతో అడ్మిట్ అయ్యాను. ఆందోళన చెందవద్దని డాక్టర్లు సూచించారు. త్వరలోనే కోలుకునే అవకాశం ఉంది’’ అంటూ స్పందించింది. ఈ తమిళ (Khushbu Sundar) నటి విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన వారిసు మూవీలో నటించింది. తమిళంలో మంచి వసూళ్ల సాధించిన ఈ మూవీ ఖుష్బుకు మరింత పేరు తీసుకొచ్చింది.

ఇటీవల ఖుష్బూ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్టయింది. తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయపెట్టింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు ఖుష్బూ వెల్లడించింది. తన తండ్రి (Father) నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే అప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని, పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని చెప్పింది. దాంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది.

Also Read: Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్స్ కిటకిట