Kushboo : సీనియర్ హీరోయిన్ ఖుష్బూ టాలీవుడ్, కోలీవుడ్ లో తన విశేషమైన కెరీర్‌తో ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్న నటి. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఎన్నో రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం వేరే వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే.. ఖుష్బూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఖుష్బూ తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ గాయాల కారణంగా బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖుష్బూ తన ఎడమ చేతికి గాయాలైన ఫోటోలను షేర్ చేస్తూ, కండరాల ఎలర్జీ వల్ల తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు తెలిపింది. సాధారణంగా స్పోర్ట్స్ పర్సనాలిటీలు హార్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఈ రకమైన కండరాల ఎలర్జీ సమస్యను ఎదుర్కొంటారు. ఖుష్బూ కూడా ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న ఆమె, నేటికి తన కఠిన వర్కౌట్‌లతో చాలా స్లిమ్‌గా మారింది. దీంతో ఈ కండరాల సమస్య ఇప్పుడు ఆమెకు సమస్యగా మారింది.
Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా
తన ఆరోగ్య పరిస్థితి సరైనదిగా ఉండకపోయినా, ఖుష్బూ షూటింగ్‌లకు పాల్గొంటున్నది. ఈ విషయాన్ని తెలిసిన ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగులో , తమిళంలో విజయవంతమైన సినీ కెరీర్‌ను సాగించిన ఖుష్బూ ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ, తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోంది.
అందులోని కమెడియన్లతో జోకులేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఖుష్భూ. తన భర్త సుందర్ కూడా మంచి దర్శకుడిగా పేరుపొందాడు. హార్రర్ సినిమాల్లో మంచి విజయాలు సాధించిన సుందర్, ప్రేక్షకుల హృదయాలలో తనకు ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఖుష్బూ తన కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించిన భారత అంపైర్.. రీజన్ ఇదే!