Yash Breaks Records: బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు బ్రేక్ చేసిన ‘కేజీఎఫ్ స్టార్ యశ్’…!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 10:18 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసిన ఈ మూవీ… సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. మరోవైపు చూస్తే… ‘కేజీఎఫ్ 2’ కలెక్షన్ల సునామీకి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనబడడం లేదు.. ఎందుకంటే విడుదలైన పది రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసింది. సౌత్ ఇండియా లోనే కాకుండా.. నార్త్ ఇండియాలోనూ భారీ వసూళ్లు రాబడుతూ దుమ్ము లేపుతోంది.

వరల్డ్ వైడ్ గా విడుదలై, అంచనాలను మించి సంచనల విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ ను సైతం కొల్లగోడుతూ… బ్రేకులు లేని బుల్డోజర్‏లా దూసుకుపోతుంది. ఇప్పటికే సౌత్‏లో గత రికార్డులను తిరగరాసిన ‘కేజీఎఫ్ 2’ మూవీ.. తాజాగా హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది. విడుదలైన పది రోజుల్లోనే ‘కేజీఎఫ్ 2’ చిత్రం… రూ. 300 కోట్ల క్లబ్‏లో చేరింది. రెండో వారంలోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసింది… దీంతో హిందీలో అత్యథిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా రికార్డుకెక్కింది.

ఆదివారం విడుదలైన ‘జెర్సీ’ సినిమా కంటే రెట్టింపు వసూళ్లు సాధించింది. రెండవ వారంతంలోనే రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టింది కేజీఎఫ్ 2. యశ్ టెర్రిఫిక్ నటనకు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు హిందీలో రూ. 500 కోట్లు క్రాస్ చేసిన రికార్డ్ ‘బహుబలి 2’ సినిమాకి ఉండగా.. త్వరలోనే ఈ రికార్డును ‘కేజీఎఫ్ 2’ బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇప్పటికే రాఖీభాయ్ తన ఖాతాలో పలు రికార్డులను వేసుకోగా… ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో అన్నది చూడాలి.