KGF actor Krishnaji Rao: కన్నడ పరిశ్రమలో విషాదం.. KGF నటుడు మృతి

స్టార్ నటుడు యష్ నటించిన KGF చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటుడు కృష్ణాజీరావు (KGF actor Krishnaji Rao) కన్నుమూశారు. కృష్ణ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతను ఇటీవలే ఆసుపత్రిలో చేరాడు. కృష్ణ (KGF actor Krishnaji Rao) మృతికి వయోభారం కారణంగా వచ్చిన చిక్కులే కారణమని చెబుతున్నారు. బెంగుళూరులోని సీతా సర్కిల్ సమీపంలోని వినాయక్ ఆసుపత్రిలో చేరాడు. ఉపిరి తిత్తుల సమస్యలతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన కన్ను మూశారు. ఆర్ధిక […]

Published By: HashtagU Telugu Desk
KGF ACTOR

Cropped

స్టార్ నటుడు యష్ నటించిన KGF చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటుడు కృష్ణాజీరావు (KGF actor Krishnaji Rao) కన్నుమూశారు. కృష్ణ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతను ఇటీవలే ఆసుపత్రిలో చేరాడు. కృష్ణ (KGF actor Krishnaji Rao) మృతికి వయోభారం కారణంగా వచ్చిన చిక్కులే కారణమని చెబుతున్నారు. బెంగుళూరులోని సీతా సర్కిల్ సమీపంలోని వినాయక్ ఆసుపత్రిలో చేరాడు.

ఉపిరి తిత్తుల సమస్యలతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన కన్ను మూశారు. ఆర్ధిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ కష్టం అవ్వడంతో.. కొంత మంది సన్నిహితులు ఆయనను హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ట్రీట్మెంట్ ఇస్తుండగానే.. శరీరం సహకరించకపోవడంతో కృష్ణ కన్ను మూశారు. ఆయన మరణంతో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణ రావు మరణంతో కన్నడ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురైయ్యారు.

Also Read: Megastar Chiranjeevi: సంక్రాంతి రేసులో చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు సంతాపం తెలిపారు. యష్ చిత్రం KGF అభిమానులు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. చిత్రం మొదటి భాగంలో గని కార్మికులు ఒక గుడ్డి వృద్ధుడిని చంపడానికి తీసుకువెళ్ళే వృద్ధుడి పాత్ర. ఆ తర్వాత సినిమాలో రాకీ ఈ వృద్ధుడిని రక్షిస్తాడు. కృష్ణ తన కెరీర్‌లో ఇప్పటివరకు చాలా చిత్రాలకు పనిచేశాడు. అయితే KGF తర్వాత అతనికి దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. కేజీఎఫ్ చేసిన తర్వాత 30కి పైగా సినిమాల్లో పనిచేశాడు.

  Last Updated: 08 Dec 2022, 05:29 AM IST