KGF 2 Trailer: ‘రక్తంతో రాసిన కథ ఇది.. మళ్లీ రక్తాన్నే అడుగుతుంది’

యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ నటించిన KGF: చాప్టర్ 2 ట్రైలర్ విడుదలైంది.

  • Written By:
  • Updated On - March 27, 2022 / 08:56 PM IST

యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ నటించిన KGF: చాప్టర్ 2 ట్రైలర్ విడుదలైంది. గరుడ హత్య తర్వాత ఏం జరిగిందనే దానితో ట్రైలర్‌ మొదలవుతుంది. ఆ తర్వాత ‘రక్తంతో రాసిన కథ ఇది… ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది’ అని ప్రకాశ్ రాజ్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు. ఇక అధీర గెటప్‌లో సునీల్ దత్ లుక్ ప్రత్యేకంగా ఉంటుంది. అధీర, యష్ (రాకీ), మధ్య  జరిగే పోరాట సన్నివేశాలు మరింత ఆసక్తి రేపుతాయి.

”వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్ . ఐ డోంట్ లైక్. ఐ అవైడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ. ఐ కాంట్ అవైడ్” ఈ డైలాగ్ తో హీరో యష్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ట్రైలర్‌లోని ప్రతి పాత్ర ఒక ఇంటెన్సివ్ తో కూడుకుని ఉంటుంది. అంతేకాదు.. విజువల్స్ కూడా కేజీఎఫ్ కు మించి ఉంటాయి. ట్రైలర్ చివరి భాగం హింస, రక్తపాతంతో నిండి ఉంది. కన్నడ ఒరిజినల్‌తో పాటు ఐదు విభిన్న భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. దక్షిణ భారతదేశానికి చెందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 14 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేజీఎఫ్-1 సూపర్ హిట్ కావడంతో.. కేజీఎఫ్-2పై అంతకుమించి అంచనాలున్నాయి.