Keerthy Suresh Vacation: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న కీర్తి సురేష్.. పిక్స్ వైరల్!

కీర్తి సురేష్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని రిఫ్రెష్ అవుతోంది. స్విమ్ సూట్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Keerthy Suresh

Keerthy Suresh

కీర్తి సురేష్ (Keerthy Suresh) అనగానే సాంప్రదాయ, హోమ్లీ పాత్రలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఈ బ్యూటీ మొదటిసారి మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అందాల డోసు పెంచింది. ఎప్పుడు కనిపించలేనంతగా హాట్ గా కనిపించింది. సౌత్ సినిమాల్లో టాప్ స్టార్స్‌లో ఒకరైన కీర్తి ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని రిఫ్రెష్ అవుతోంది. కో స్యామ్యూయ్ అనే ఏకాంత ద్వీపంలో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తోంది. ఓ అందమైన ప్రైవేట్ బీచ్‌ల్లో సముద్రం తీరంలో చల్లగా గడిపింది. ప్రస్తుతం కీర్తికి సంబంధించిన ఫొటోలో వైరల్ (Viral) గా మారాయి.

30 ఏళ్ల ఈ మహనటి (Keerthy Suresh) స్విమ్‌సూట్, గాగుల్స్ ధరించి సెగలు రేపుతోంది. మరొక ఫోటోలో, చల్లని వాతావరణంలో నేచర్ ను ఎంజాయ్ చేస్తోంది. అందమైన సూర్యాస్తమయాలను కూడా ఆస్వాదించింది. ఈ పిక్స్ వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ బాక్స్‌లో రెడ్ హార్ట్ ఎమోజీల వర్షం కురిపించారు. ప్రస్తుతం కీర్తి (Keerthy Suresh) నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ చిత్రం వేదాళం తెలుగు రీమేక్ భోళా శంకర్ అనే చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది.

నాచురల్ స్టార్ నాని సినిమా ‘దసరా’ అనే మరో యాక్షన్ డ్రామా తెలుగు సినిమాలోనూ నటిస్తోంది. మరి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన తమిళ చిత్రం మామన్నన్‌లో కీర్తి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఆమె సైరన్ అనే చిత్రం కూడా ఒప్పుకుంది. రాబోయే సినిమాల గురించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఈ బ్యూటీ స్విమ్ సూట్ (Swim suit) లో కనిపించి అందాలను ఆరబోసి అభిమానులను ఆకట్టుకుంది.

Also Read: Muhammad Ali Old Video: దటీజ్ మహమ్మద్ అలీ.. 10 సెకన్లలో 21 పంచులు, బాక్సింగ్ కింగ్ టైమింగ్ కు నెటిజన్స్ ఫిదా!

  Last Updated: 09 Jan 2023, 04:07 PM IST