Site icon HashtagU Telugu

Kavya Kalyan Ram : బలగం బ్యూటీ ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదుగా..!

Kavya Kalyan Ram Latest Photoshoot

Kavya Kalyan Ram Latest Photoshoot

Kavya Kalyan Ram చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో అలరించిన కావ్య కళ్యాణ్ రాం బలగం సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది. వేణు యెల్దండి డైరెక్షన్ లో తెరకెక్కిన బలగం సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా కావ్య కళ్యాణ్ రాం నటించింది. బలగం సూపర్ హిట్ అవ్వడంతో కావ్యాకి మంచి మైలేజ్ పెరిగింది.

ఇక లాస్ట్ ఇయర్ ఉస్తాద్ అంటూ సింహా హీరోగా నటించిన సినిమాలో నటించింది అమ్మడు. ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లింది తప్ప అమ్మడికి ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే సినిమాలతో కాకుండా కావ్య కళ్యాణ్ రాం ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. అమ్మడు చేస్తున్న ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

లేటెస్ట్ గా కావ్య మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది. బ్లాక్ శారీ ఒంటి నిండా బంగారంతో దగ దగా మెరిసిపోతుంది అమ్మడు. సినిమాలతో వచ్చిన ఫాలోయింగ్ కన్నా కావ్యాకి ఇలా ఫోటో షూట్స్ తో వచ్చే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కచ్చితంగా అమ్మడికి ఈ ఫోటో షూట్స్ వల్ల భారీ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా బ్లాక్ కలర్ శారీలో అమ్మడు క్రేజీ ఫోటో షూట్ ఫాలోవర్స్ ని మరింత ఎట్రాక్ట్ చేస్తుంది. సరైన ఛాన్స్ వస్తే చాలు కానీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్న కావ్యా కాస్త ట్రై చేస్తే చాలు కానీ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.

Also Read : Teja Sajja : తేజా సజ్జా పర్ఫెక్ట్ లైనప్..!