టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ (Karthik Varma Dandu ) కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ‘విరూపాక్ష’, ‘భమ్ భోలేనాథ్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీక్ వర్మ తాజాగా నిశ్చితార్థం(Karthik Varma Dandu Engagement)చేసుకున్నారు. హర్షిత (Harshitha) అనే యువతితో ఆయన వివాహం నిశ్చయమైనట్టు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
Jagan : పుట్టినప్పుడే జగన్ గొంతు నొక్కేయాల్సింది – రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా కార్తీక్ వర్మ నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను షేర్ చేయగా, ఫిల్మ్ ఇండస్ట్రీలోని సహచరులు, అభిమానులు శుభాకాంక్షలతో స్పందిస్తున్నారు. ఈ వేడుక కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదాగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ జంటకు సినీ ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ ఏడాది చివర్లో కార్తీక్ వర్మ, హర్షితల వివాహం జరగనుందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కార్తీక్ అక్కినేని చైతన్యతో ఓ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. త్వరలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
