Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న తమన్నా సూపర్ హిట్ మూవీ.. అదేంటంటే?

ఇటీవల కాలంలో తెలుగులో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు తెలుగులోకి రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టాయి. We’re now on WhatsApp. Click to Join మెగాస్టార్ […]

Published By: HashtagU Telugu Desk
Paiyaa Movie

Paiyaa Movie

ఇటీవల కాలంలో తెలుగులో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు తెలుగులోకి రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టాయి.

We’re now on WhatsApp. Click to Join
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, సిద్ధార్థ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోస్ సినిమాలన్నింటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. ఇటీవలే దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత మరోసారి ఉదయ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి ఎమోషనల్ అయ్యారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అదే పైయ్యా ఒకటి. కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు.

Also Read: Ajith Kumar: షూటింగ్ లో హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!

2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా బ్యానర్ పై సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆవారా పేరుతో రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ శ్రోతలను మెస్మరైజ్ చేసింది. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా అటు ఇందులోని సాంగ్స్ అని సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఆవారా చిత్రాన్ని ఇప్పుడు 4కే వెర్షన్ తో ఏప్రిల్ 11న తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారట. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తానని గతంలో డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు.

Also Read: Suriya – Jyothika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వీడియో వైరల్!

  Last Updated: 04 Apr 2024, 06:45 PM IST