Site icon HashtagU Telugu

Karthi : అన్న సినిమాలో తమ్ముడు.. సీక్రెట్ గా ఉంచాల్సింది కానీ..?

Surya Kanguva First Day Collections

Surya Kanguva First Day Collections

సూర్య నటిస్తున్న కంగువ (Kanguva Movie) సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమా లో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి ఒక న్యూస్ సూర్య ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అంటే సినిమాలో సూర్య తమ్ముడు కార్తి కూడా ఉంటాడని తెలుస్తుంది.

కంగువ సినిమా సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో డిఫరెంట్ మూవీగా వస్తుంది. ఈ సినిమా విషయంలో సూర్య చాలా ఫోకస్ గా ఉన్నాడు. సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న సూర్య (Surya) ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకూడాని సర్ ప్రైజ్ లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కంగువ సినిమాలో సూర్య సోదరుడు స్టార్ హీరో కార్తీని కూడా తీసుకున్నారట.

కంగువ సినిమాలో ఒక సర్ ప్రైజ్ క్యామియో (Karthi Cameo Role) ఆయనదని తెలుస్తుంది. ఈ పాత్ర ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుస్తుంది. కార్తీ ప్రస్తుతం సర్ధార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. సూర్య కంగువ సినిమాలో కార్తి కూడా ఉంటే కచ్చితంగా ఆ సినిమాకు సంథింగ్ క్రేజ్ వచ్చినట్టే లెక్క.

కార్తీ మాత్రమే కాదు సినిమాలో మరికొన్ని క్యామియోలు సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని అంటున్నారు. సూర్య కంగువ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ కూడా సినిమాకు సపోర్ట్ చేస్తుందని అంటున్నారు.  మరి సూర్య కార్తీ కలిసి కనిపించే మూవీగా కంగువ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటుండగా వీరిద్దరు కలిసి చేసే సీన్స్ ఎలా ఉంటాయన్నది చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Also Read : Ram Charan : చరణ్ పెద్దిలో అలాంటి లుక్ ఉంటుందా..?