Site icon HashtagU Telugu

Kantara Qualifies Oscars: అరుదైన ఘనత.. ఆస్కార్ అవార్డుకు కాంతార క్వాలిఫై

Kantara 2

Kantara

కన్నడ స్టార్ రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార (Kantara) బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా కాంతార మూవీ ఆస్కార్ అవార్డు (Oscar Awards)కు క్వాలిఫై అయినట్లు మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు కాంతార మూవీని కూడా నామినేషన్‌లో చేర్చాలని నిర్మాణ సంస్థ అప్లికేషన్ పంపింది. ఇప్పుడు రెండు విభాగాల్లో క్వాలిఫై అయినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలిసింది కాంతార సినిమా గురించే. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ప్రపంచం మెచ్చిన సినిమాలలో కాంతారా సినిమా ఒకటి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

Also Read: Mrunalini Ravi : కుర్ర హృదయాల్లో ఓ తారక ..మృణాళిని

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన కాంతారా సినిమా ఆస్కార్ అవార్డులకు క్వాలిఫై అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు కాంతారా కూడా నామినేషన్ లో చేర్చాలని హోంబలే ఫిలిమ్స్ అప్లికేషన్ పంపింది. ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతార ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు రెండు విభాగాల్లో క్వాలిఫై అయినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆస్కార్ బ్యాలెట్‌ల కోసం ఓటింగ్ జనవరి 11 నుండి ప్రారంభమవుతుంది. జనవరి 17 వరకు కొనసాగుతుంది. తుది నామినేషన్లు జనవరి 24న ముగుస్తాయి. కన్నడ సంప్రదాయమైన భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన కాంతార సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకత్వం వహించి నటించారు. ఈ చిత్రంలో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కూడా ముఖ్య పాత్రలు పోషించారు.