Site icon HashtagU Telugu

Kantara Actor: క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. కాంతార న‌టుడు క‌న్నుమూత‌!

Kantara Actor

Kantara Actor

Kantara Actor: కన్నడ సినిమా పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘కాంతార’ చిత్రంలో నటించిన నటుడు (Kantara Actor) టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్కాలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 55. కాంతార సినిమాలో మ‌హాదేవ పాత్ర‌లో ఆయ‌న క‌నిపించారు. ఐదేళ్ల క్రితం ఆయ‌నకు గుండె ఆప‌రేష‌న్ జ‌రిగింది. ప్ర‌భాక‌ర్‌కు భార్య‌, కుమారుడు ఉన్నారు. తొలుత నాట‌క‌రంగంలో ప‌ని చేసిన ఆయ‌న క్ర‌మంగా సినిమాల్లోకి వ‌చ్చారు.

Also Read: HDFC Bank : లోన్ వడ్డీ రేట్లు తగ్గించి ఖాతాదారుల్లో ఆనందం నింపిన HDFC బ్యాంక్

ప్రభాకర్ నటుడిగానే కాకుండా నాటక కళాకారుడిగా కూడా మంచి పేరు పొందారు. ఆయన మరణం కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నింపింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. గతంలో కూడా ‘కాంతార’ చిత్రానికి సంబంధించిన పలువురు నటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. మే నెలలో నటుడు రాకేష్ పూజారి (34) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కూడా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో నటించారు. అలాగే అదే నెలలో జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. జూన్‌లో నటుడు నిజు కలభవన్ గుండెపోటుతో మరణించారు. ఈ వరుస విషాదాలు ‘కాంతార’ చిత్ర బృందాన్ని, కన్నడ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేశాయి.