Kantara 2 Update: కాంతార-2కు ముహూర్తం సిద్ధం, త్వరలోనే షూటింగ్ షురూ!

కాంతార ఫ్యాన్స్ కు గుడ్ చెప్పేసింది కాంతార టీం. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అతిపెద్ద అప్ డేట్ వచ్చేసింది.

  • Written By:
  • Updated On - June 14, 2023 / 03:15 PM IST

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అటు నార్త్, ఇటు సౌత్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను మెప్పించడంతో కాంతార స్వీకెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కాంతార ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కాంతార టీం. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అతిపెద్ద అప్ డేట్ వచ్చేసింది.

సినీ వర్గాల ప్రకారం..  కాంతార-2 ఆగస్ట్ 27 న సెట్స్ మీదకు వెళ్లనుంది. రిషబ్ శెట్టి కాంతారావు 2 వచ్చే రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఆగష్టు 27, 2023న ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. అయితే షూట్‌లో కొంత భాగం వర్షాకాలం కావాల్సిన అవసరం ఉన్నందున, ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని రిషబ్ ప్లాన్ చేసినట్లు హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ తెలిపారు.

హీరో రిషబ్ శెట్టి కాంతార పార్ట్-1 సినిమా చేస్తున్నప్పుడే ఆయన మదిలో కాంతార2 చేయాలని ఆలోచన మొదలైంది. సినిమా కథనం, నిడివి బట్టి స్వీకెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే కాంతారకు సంబంధించిన కథలో ఎక్కువ లోతు ఉండటం, అనేక చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలు ముడిపడి ఉండటంతో పార్ట్-2 చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చిలో ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీని ప్రారంభించే అవకాశాలున్నాయి.  2024లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కాంతార మూవీ బాలీవుడ్ ను సైతం ప్రభావితం చేయడంతో పలువురు స్టార్స్ రిషబ్ తో నటించడానికి ఆసక్తి చూపుతారు. కాంతార2 లో భారీ స్టార్ కాస్ట్ ఉండే అవకాశం ఉంది.

Also Read: Jai Balayya: జై బాలయ్య.. ఇది స్లోగన్ మాత్రమే కాదు, ఓ ఎమోషన్!