Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ రేపు (జూన్ 27) గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా, ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం, ఉద్దేశపూర్వక విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన చిత్ర బృందం, ఇప్పటికే అప్రమత్తమైంది. సినీ విమర్శకులు, మీమర్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులకు ముందుగా హెచ్చరికలు జారీ చేస్తూ, కావాలనే చేసిన దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఈ మేరకు దిల్లీ హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి కూడా పొందినట్లు ‘కన్నప్ప’ యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా విడుదలకి ముందు చిత్ర బృందం పబ్లిక్ నోటీసుగా ఒక హెచ్చరికను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాలోని అంశాలపై వాస్తవాల ఆధారంగా అభిప్రాయం చెప్పడం తప్పు కాదు కానీ, వ్యక్తిగత కక్షలతో పరువు నష్టం కలిగించేలా కామెంట్లు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని బృందం స్పష్టం చేసింది.
చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమా కోసం శ్రీకాళహస్తి క్షేత్ర పురాణం పరిజ్ఞానం ఉన్నవారి నుంచి వ్రాతపూర్వక అనుమతులు తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ తీసుకొని, విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎలాంటి రాజీ లేకుండా, విడుదల తేదీని కూడా వెనక్కి వేసి క్వాలిటీ అందించడానికి ప్రయత్నించామని వివరించారు.
తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షలతో కొందరు కావాలనే విమర్శలు చేయబోతున్నారని ముందుగానే గ్రహించిన టీమ్, ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇలాంటి దుష్ప్రచారం జరిగిన సందర్భాలను ప్రస్తావించింది. కేరళలో ఒక నిర్మాతకు ఎదురైన పరిస్థితిని ఈ సందర్భంలో గుర్తుచేస్తూ, ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.‘కన్నప్ప’ సినిమాను ప్రేక్షకులు నిజాయితీగా విశ్లేషించాలే కానీ, అప్రయత్న విమర్శలు, వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని బృందం సూచించింది.
Hyderabad: ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట