మంచు విష్ణు (Manchu VIshnu) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప (Kannappa) రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు విష్ణు ‘X’లో వెల్లడించారు. కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకా అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం మోహన్ బాబు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో సంతోషం నింపారు.
‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్‌లో.. మహాదేవ శాస్త్రి (Mahadeva Shastri)గా మోహన్ బాబు గంభీరమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో ఈ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అనే క్యూరియాసిటీని ఈ లుక్ నెలకొల్పింది. ఈ కన్నప్ప సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరి కన్నప్ప సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Read Also : BRS MLAs : త్వరలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు జంప్ ?