మంచు విష్ణు (Manchu VIshnu) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప (Kannappa) రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా..ఇప్పుడు మరో పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అమాంతం అంచనాలు పెంచారు.
Balakrishna : త్వరలోనే ఎన్టీఆర్‌కు భారతరత్న: బాలకృష్ణ
తాజా పోస్టర్ లో ప్రభాస్, అక్షయ్ కుమార్ , మోహన్ బాబు , మోహన్ లాల్ ఇలా అందరి లుక్స్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటె ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మంచు విష్ణు , దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి అధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ ‘కన్నప్ప’ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.