Site icon HashtagU Telugu

Om Movie : ఒక్కసారి కాదు ఏకంగా 550 సార్లు రీరిలీజ్‌ అయిన మూవీ.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్!

Kannada Upendra Shiva Rajkumar OM Movie Re Released 550 Times

Kannada Upendra Shiva Rajkumar OM Movie Re Released 550 Times

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్(Re Release)ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు. 28 ఏళ్ళ క్రిందట కన్నడ(Kannada)లో సూపర్ హిట్ అయిన మూవీ 20 ఏళ్ళ పాటు రీ రిలీజ్ అవుతూ వచ్చింది. ఆ సినిమానే ఓం (Om). కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర(Upendra) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) నటించాడు.

కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఉపేంద్ర ఈ సినిమా కథని రాసుకున్నాడట. అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ కథకి ఒక లవ్ స్టోరీని జత చేసి ఉపేంద్ర చూపించిన స్క్రీన్ ప్లే అందర్నీ అలరించింది. 1995 మే 19న రిలీజ్ అయిన ఈ చిత్రం కన్నడనాట ఒక సంచలనంగా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమా 2015 మార్చి 12 వరకు రీ రిలీజ్ లు అవుతూ వచ్చింది. మొత్తం మీద ఈ సినిమా 550 సార్లు రీ-రిలీజ్‌ అయ్యింది. ఇన్నిసార్లు రీ రిలీజ్‌ చిత్రంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో (Limca Book of Records) కూడా స్థానం దక్కించుకుంది.

బెంగళూరులోని కపిల్‌ థియేటర్‌లోనే ఈ చిత్రం అత్యధికంగా 30సార్లు రీ-రిలీజ్‌ అయ్యింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమ (Prema) నటించింది. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగు, హిందీలో కూడా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాని రాజశేఖర్ ‘ఓంకారమ్’ పేరుతో రీమేక్ చేశాడు. హిందీలో సన్నీ డియోల్ రీమేక్ చేశాడు. ఈ రెండు రీమేక్స్ కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి.

 

Also Read : Priyanka Chopra: ప్రియాంక చోప్రా కుమార్తె ఫోటోలు వైరల్