సూపర్ స్టార్ రజినికాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ఐతే స్టార్ ఇమేజ్ ఉన్న కొందరు ఆయనతో నటించాలని అనిపించినా అందుకు తగిన కథ దొరక్క ఆగిపోతుంటారు. ఐతే రజిని చేస్తున్న కూలీ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) కూడా నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించేందుకు ఉపేంద్ర ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదట.
రజిని సినిమాలో తన పాత్ర కోసం లోకేష్ ఫోన్ చేయగా స్టోరీ లైన్ చెప్పి తన పాత్ర చెప్పబోతుండగా అది పూర్తి కాకుండానే సినిమా చేస్తానని ఆయన అన్నారట. రజినితో నటించడం అదృష్టమని అంతకుమించిన ఆనందం ఏముంటుందని ఉపేంద్ర అన్నారు. కన్నడ స్టార్ హీరో అయిన ఉపేంద్ర రెండు దశాబ్ధాల క్రితమే తన మార్క్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ ని అలరించారు.
ఉపేంద్ర మిగతా సౌత్ భాషల్లో కూడా..
ఇప్పటికీ కన్నడలో సినిమాలు చేస్తున్న ఉపేంద్ర మిగతా సౌత్ భాషల్లో కూడా నటిస్తున్నారు. తెలుగులో ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. రజిని కూలీలో ఉపేంద్ర మాత్రమే కాదు కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
రజిని నటించిన వేటయ్యన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కు రెడీ అవుతుంది. టీ జీ జ్ఞానవెల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రజిని వేటయ్యన్ లో రానా, ఫాహద్ ఫాజిల్ నటించారు.
Also Read : Raviteja – Balakrishna : సంక్రాంతికి రవితేజ ప్లేస్ లో బాలయ్య..!