Site icon HashtagU Telugu

Kangana Ranaut : కంగన ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా వీడియో వార్నింగ్.. అందులో ఏముంది?

BJP has responded to Kangana Ranaut's farmers' protest comments

Kangana Ranaut : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తాజాగా ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? తాను నటిస్తున్న తదుపరి మూవీ ‘ఎమర్జెన్సీ’  గురించి ఆమె పోలీసులను సంప్రదించారు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

‘ఎమర్జెన్సీ’ అనే టైటిల్‌తో కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రధాన తారగా ఒక సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఆ వెంటనే సోషల్ మీడియాలో బెదిరింపు వీడియోలు రిలీజ్ అయ్యాయి.ఈ మూవీ విడుదలపై అభ్యంతరం తెలుపుతూ, కంగనా రనౌత్‌ను బెదిరిస్తూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన మంగళవారం ఉదయం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఆ  వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంగనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో ఆరుగురు యువకులు ఒక సర్కిల్‌లో కూర్చున్నారు. వారిలో ఇద్దరు నిహంగ్ సిక్కులలా డ్రెస్కులు వేసుకొని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాను సిక్కు సమాజం ఖండిస్తుందన్నాడు. ఆ సినిమాకు చెప్పులతో స్వాగతం లభిస్తుందని పేర్కొన్నాడు. ఈ వీడియోలో విక్కీ థామస్ సింగ్ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్ వాలేను ఉగ్రవాదిగా చూపిస్తే.. ఆ సినిమాలోని ప్రధాన పాత్ర (ఇందిరాగాంధీ)కు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి’’ అని వార్నింగ్ ఇచ్చాడు.

Also Read :KTR : హైదరాబాద్ డెవలప్‌మెంట్‌‌ను విస్మరిస్తారా ? ఎస్‌ఆర్‌డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్

విక్కీ థామస్ సింగ్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఎక్స్‌లో ఇతడు భింద్రన్ వాలేను మెచ్చుకుంటూ నిత్యం వీడియోలు పెడుతుంటాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలోనూ..  1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ గురించి అతడు గొప్పగా వ్యాఖ్యలు చేశాడు. ‘‘దేశం కోసం మేం తలలు ఇవ్వగలం.. మమ్మల్ని ఎవరైనా ఇబ్బందిపెడితే సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లా తలలు కూడా తీయగలం’’ అనే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోను కంగనా రనౌత్  తప్పుపట్టారు. దీన్ని మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), హిమాచల్ పోలీసులు, పంజాబ్ పోలీసులకు ఆమె ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. “దయచేసి దీనిని పరిశీలించండి” అని కోరారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీకి చెందిన పలు సంస్థలు ఎమర్జెన్సీ మూవీ విడుదలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశాయి. ఇది “సిక్కు వ్యతిరేక” కథనాన్ని వ్యాప్తి చేస్తుందని, సిక్కులను “వేర్పాటువాదులు”గా తప్పుగా చిత్రీకరిస్తున్నదని ఆరోపించాయి.  ఈ సినిమా ట్రైలర్‌లో ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన టైంలో.. తండ్రి జవహర్‌లాల్ నెహ్రూతో ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించారు.  ఆమె తన రాజకీయ జీవితంలో వివాదాలు, రాజకీయ గందరగోళం, ఇతర సమస్యలను ఎలా డీల్ చేశారనేది కూడా చూపించారు.