Site icon HashtagU Telugu

Emergency Teaser: కాకా పుట్టిస్తున్న కంగనా ‘ఎమర్జెన్సీ’ టీజర్

Emergency Teaser

24 06 2023 Emergency Trailer 23450671

Emergency Teaser: కంగనా రనౌత్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఎమర్జెన్సీ’ విడుదల తేదీ ఖరారు చేసింది ఆ చిత్ర యూనిట్. 2023 నవంబర్ 24 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ముందుగా అక్టోబర్‌లో సినిమా విడుదల తేదీని పెట్టుకున్నప్పటికీ పరిస్థితుల రీత్యా నవంబర్‌లో ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితమే ‘ఎమర్జెన్సీ టీజర్ విడుదలైంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను హైలెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

‘ఎమర్జెన్సీ’ టీజర్ ని కంగనా తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 తేదీతో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రతిపక్షలు అరెస్ట్, మీడియా ప్రసారాలు ఆగిపోయాయి, ప్రజలు వీధుల్లోకి వచ్చారు, పోలీసులు అణచివేత విధానాన్ని అవలంబిస్తున్నారు, బుల్లెట్లు కాల్చారు. అప్పుడు ఇందిరా గాంధీ … ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిర అనే శక్తివంతమైన స్వరం వినిపిస్తుంది. ఇలా సాగిన ఈ టీజర్ పై కంగనా ఆసక్తికర కాప్షన్ రాసుకొచ్చింది. రక్షకుడా లేక నియంత?.  మన దేశ లీడర్ తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన రోజు చరిత్రలోనే చీకటి రోజుగా పేర్కొంటూ పోస్ట్ చేసింది. ‘ఎమర్జెన్సీ’ నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎమర్జెన్సీ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయనున్నారు. కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రితేష్ షా స్క్రిప్ట్ అందించారు.

మొత్తానికి టీజర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. ఆ నాడు జరిగిన పరిణామాలను తెరకెక్కించడంలో కంగనా సక్సెస్ అయిందనే చెప్పాలి. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఎమర్జెన్సీ’ ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Read More: Rahul Gandhi Marriage: విపక్షాల మీటింగ్ రాహుల్ పెళ్లి కోసమేనా?