Site icon HashtagU Telugu

Kangana Ranaut: అలాంటి డబ్బు నాకొద్దు.. కంగనా కామెంట్స్!

Kangana ranaut bollywood

Kangana

హీరోహీరోయిన్స్ ఒకవైపు సినిమాల్లో (Cinema) డబ్బు సంపాదిస్తూనే, మరోవైపు పార్టీలు, ఫంక్షన్లకు ముఖ్య అథితిగా, ఎంటర్ టైనర్స్ గా వెళ్తూ అధిక మొత్తంలో మనీని సంపాదిస్తుంటారు. కొంతమంది హీరోయిన్స్ ప్రైవేట్ పార్టీలలో ప్రదర్శనలు చేస్తూ సొమ్ము చేసుకుంటుంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)  అలాంటి వాటికి దూరంగా ఉండనున్నట్టు ప్రకటించింది. కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పెళ్లిళ్లలో ఎందుకు ప్రదర్శనలు ఇవ్వలేదో అనే విషయాన్ని ప్రస్తావించారు. అందుకు సంబంధించిన గాయని ఆశా భోంస్లే మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.

ఆశా భోంస్లే తన అక్క లెజెండరీ సింగర్‌కి పెళ్లిలో పాటలు పాడటానికి మిలియన్ డాలర్లు ఎలా ఆఫర్ చేశారని, అయితే ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందని చెప్పింది. కంగనా  (Kangana Ranaut) క్యాప్షన్ ఇస్తూ “అంగీకరిస్తున్నాను. నేను పెళ్లిళ్లె లేదా ప్రైవేట్ పార్టీలలో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. ఈ వీడియోను చూసినందుకు ఆనందంగా ఉంది. లతాజీ నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను కూాడా అలాంటి పార్టీలు, పంక్షన్లకు దూరంగా ఉంటా’’ అని చెప్పింది కంగనా. ప్రస్తుతం  (Kangana Ranaut) కంగనా తన దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’లో నటిస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.

Also Read: Nivetha and Vishwak Sen: వాట్ ఏ కెమిస్ట్రీ.. నివేదాతో విశ్వక్ సేన్ రొమాన్స్ మాములుగా లేదు!