Site icon HashtagU Telugu

Kangana Ranaut: గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కంగనా రనౌత్!

Kangana

Kangana

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అటు సామాన్యుల్లో, అటు సెలబ్రిటీల్లో ఊహించని రెస్పాన్ వస్తోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. శంషాబాద్‌లోని పంచవటి పార్కులో ఆమె మొక్కలు నాటి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ (Kangana Ranaut) మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని, ప్రతిఒక్కరూ ఈ ఛాలెంజ్‌ని అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ , అంజలీ చౌహాన్‌ ముగ్గురికి కంగనా ఛాలెంజ్ విసిరారు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని కంగనా (Kangana Ranaut) కు బహూకరించారు.

2019లో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటడంతోపాటు పర్యావరణం పట్ల బాధ్యత వహించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఛాలెంజ్‌ని మహేష్ బాబు, ప్రభాస్, రానా దగ్గుబాటి సహా పలువురు ప్రముఖులు స్వీకరించి ప్రచారం కల్పించారు.

Also Read:KTR: హైదరాబాద్ కు రెండు అంతర్జాతీయ ప్రాజెక్టులు!