Kamal Haasan : చదువుకు వయసు ఎప్పుడూ అడ్డం కాదు. ఎంతోమంది ఏజ్ పెరిగినా ఇంకా కొత్త కొత్త చదువులు చదువుకుంటారు. అలాంటి వాళ్ళని కచ్చితంగా అభినందించాల్సిందే. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు స్టార్ హీరో కమల్ హాసన్ చేరారు. స్టార్ హీరో కమల్ హాసన్ 69 ఏళ్ళ వయసులో చదువుకోడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ AI ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. AI తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ AI కోర్స్ చదువుకోడానికి అమెరికా వెళ్ళారంట. కమల్ సన్నిహితుల సమాచారం ప్రకారం అమెరికాలో 90 రోజుల AI కోర్స్ చేయడానికి కమల్ హాసన్ వెళ్లారట.
45 రోజులు డైరెక్ట్ గా క్లాస్ కి వెళ్లి నేర్చుకొని, ఆ తర్వాత 45 రోజులు ఆన్లైన్ కోర్స్ చేస్తారట. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 69 ఏళ్ళ వయసులో నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉండి కూడా ఇప్పుడు చదువుకుంటున్నారని, చదువుకోడానికి అమెరికా వెళ్లారని, కొత్త టెక్నాలజీపై మక్కువ చూపిస్తున్నారని అంతా కమల్ హాసన్ ని అభినందిస్తున్నారు. అయితే దీనిపై కమల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read : Venkatesh – Rana : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం.. బాబాయ్ – అబ్బాయి భారీ విరాళం..