సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao), లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) కాంబినేషన్ కి ఆడియన్స్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఒక కొత్త అనుభూతుని ఇచ్చాయి. ‘అమావాస్య చంద్రుడు’, ‘పుష్పకవిమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’.. ఇలా ప్రతి సినిమా దేనికి అది ప్రత్యేకం. కాగా అమావాస్య చంద్రుడు సినిమా తరువాత వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేద్దామని అనుకున్నారు. ఆ మూవీని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ లో నిర్మిస్తాను అని చెప్పాడు.
అంతేకాదు ఆ మూవీ ఎలా ఉండాలో అనే ఐడియాని కూడా కమల్ హాసనే ఇచ్చాడట. అలా కమల్ హాసన్ ఆలోచనలో నుంచి పుట్టిన సినిమానే ‘విచిత్ర సోదరులు'(Vichitra Sodarulu). ఈ సినిమాలో కమల్ పొట్టి వాడిగా ‘మరగుజ్జు’ పాత్రలో, అలాగే అందరిలా నార్మల్ మనిషి పాత్రలో.. రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించాడు. అయితే ఈ మూవీకి ముందు అనుకున్న కథలో ఒక కమల్ హాసన్ మాత్రమే ఉంటాడు. అది కూడా మరగుజ్జు కమల్. పొట్టి కమల్ హాసన్ ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తాడు. కానీ వారిద్దరూ అతన్ని ప్రేమించరు. ఒక ప్యూర్ లవ్ స్టోరీలో చివరికి కమల్ ఒంటరిగానే మిగిలిపోతాడు. ఇలా ఒక విషాద మోగింపుతో కథని రాసుకున్నారు.
అంతేకాదు ఒక నాలుగైదు రోజులు చిత్రీకరణ కూడా చేశారు. ఈ షూటింగ్ చేసే సమయంలో సింగీతం.. ప్రముఖ నిర్మాత పంజు అరుణాచలానికి ఈ మూవీ కథని వినిపించారు. అది విన్న నిర్మాత.. కమల్ హాసన్ తో ఇలాంటి సినిమా తీస్తే కచ్చితంగా ప్లాప్ అవుతుందని చెప్పారట. అలాగే కొన్ని మార్పులు కూడా సూచించారు. దీంతో సింగీతం పగ, ప్రతీకారం నేపథ్యంతో సినిమాని కొత్తగా రాసుకున్నారు. ఇక ఆ కథకి కమల్ హాసన్ యాక్టింగ్ తోడు అవ్వడంతో థియేటర్స్ లో ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. గ్రాఫిక్స్ లేని టైములో పొట్టి కమల్ హాసన్ ని చూపించేందుకు ఎంతో కష్టపడ్డారు. అందుకోసం ప్రత్యేక డ్రెస్ లు, షూలు, సెట్ ప్రాపర్టీ.. అన్ని కొత్తగా డిజైన్ చేయించుకున్నారు. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించింది.
Also Read : Mega Updates: చిరంజీవి దూకుడు, మరో రెండు సినిమాలకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్