నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన కెరీర్ లో 21వ సినిమా చేస్తున్నడు. చిలుకూరి ప్రదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈసారి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ డైరెక్టర్ తో కలిసి పనిచేయబోతున్నాడని తెలుస్తుంది. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ తో కళ్యాణ్ రామ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
కుమారి 21ఎఫ్, 18 పేజెస్ సినిమాలతో సుకుమార్ ప్రొడక్షన్ లో సక్సెస్ లు అందుకున్న సూర్య ప్రతాప్ (Surya Pratap) తన థర్డ్ సినిమాను కళ్యాణ్ రామ్ హీరోగా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని దాదాపు ప్రాజెక్ట్ ఓకే అయినట్టే చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సూర్య ప్రతాప్ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మిస్తారని తెలుస్తుంది.
ఐతే ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు. కెరీర్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్ సూర్య ప్రతాప్ తో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ తో మంచి లవ్ స్టోరీ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
సూర్య ప్రతాప్ ఎలాంటి కథతో కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మిగతా కాస్ట్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. సుకుమార్ కథ అందిస్తే మాత్రం ఈ సినిమా మరో హిట్ పక్కా అన్నట్టే అని చెప్పుకుంటున్నారు.
Also Read : Ram Charan Game Changer : మెగా ఫ్యాన్స్ కి గేమ్ ఛేంజర్ కానుక..!