Site icon HashtagU Telugu

Kalki 2898 AD : కల్కి ‘టా టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Kalki Tata Song

Kalki Tata Song

కల్కి (Kalki 2898 AD) ‘టా టక్కర’ (Ta Takkara )ఫుల్ వీడియో సాంగ్ విడుదలై అభిమానుల్లో మరింత సంతోష పరిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ ఇలా ఎంతో మంది ఈ మూవీ లో నటించి మెప్పించగా రాజమౌళి , సల్మాన్ దుల్కర్ , విజయ్ దేవరకొండ , వర్మ వంటి వారు ప్రత్యేక పాత్రలో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమాలోని ‘టా టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. ప్రభాస్ , దిశా పటాని కాంప్లెక్ ఎక్స్ పీరియన్స్ నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుంది. సినిమా చూడనివారు ఇప్పుడు యూట్యూబ్ లో ఈ సాంగ్ చూడవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్లు వచ్చాయని మూవీటీమ్ అఫీషియల్​గా ప్రకటించింది. దీంతో తొలి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం(జూన్ 27) వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి భారీ వసూళ్లు అందుకోవడానికి కారణం ఆ సినిమాకు ఉన్న హైపే కారణం. దీనికి తోడు తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ లెక్కన రెండో రోజు శుక్రవారం కూడా భారీగానే వసూళ్లు వస్తాయని అనుకున్నారు కానీ అనుకున్నంత రాలేదు. మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.95.3 కోట్ల వరకు ఉన్నాయి. కానీ రెండో రోజు ఇండియాలో రూ.50 కోట్ల వరకు నెట్​ వసూళ్లే వచ్చాయి. ఇందులో తెలుగు నుంచి రూ.24.65 కోట్లు, తమిళం(రూ.3.5 కోట్లు), హిందీ(రూ.20.5 కోట్లు), కన్నడ(0.3 కోట్లు), మలయాళం(రూ.2 కోట్లు) వచ్చినట్లు పేర్కొంది. అయితే ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి శని, ఆదివారాల్లో మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు అవ్వొచ్చని అంతా అంచనా వేస్తున్నారు.

Read Also : Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Exit mobile version