Kalki Prelude కల్కి సినిమా రిలీజ్ ముందు నాగ్ అశ్విన్ కల్కి ప్రీల్యూడ్ అంటూ కల్కి యానిమేటెడ్ సీరీస్ ని రిలీజ్ చేశాడు. కల్కి వరల్డ్ ని పరిచయం చేస్తూ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఒక ఐడియా కోసం ఈ సీరీస్ వదిలారు. రెండు ఎపిసోడ్స్ కలిసి కేవలం 30 నిమిషాలే ఉన్నా అది అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కల్కి ప్రీల్యూడ్ యానిమేటెడ్ అటెంప్ట్ చూసిన రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఫిక్స్ అయ్యారు.
ముఖ్యంగా 2896 కాశి ఎలా ఉంటుంది. అక్కడ భైరవ అనే కుర్రాడికి బుజ్జి అనే ఒక మెటీరియల్ దొరికితే వాళ్లిద్దరు కలిసి ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా చూపించారు. శాంపిల్ గా వదిలిన కల్కి యానిమేషన్ ఎపిసోడ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా చేశాయి. నాగ్ అశ్విన్ ముందు ఈ సినిమాను యానిమేటెడ్ రిలీజ్ అనుకున్న టైం లో అందరు కాస్త కంగారు పడ్డారు కానీ కల్కి ప్రీల్యూడ్ ఎపిసోడ్స్ చూశాక రిలాక్స్ అయ్యారు.
కల్కి వెండితెర మీద అద్భుతాలు సృష్టిస్తుందని ప్రీల్యూడ్ చూసిన ఆడియన్స్ అంటున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమా నెవర్ బిఫోర్ అనిపించేలా ఇండియన్ సినిమా రికార్డులను సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు. మరి కల్కి తో ప్రభాస్ ఏ రేంజ్ కి వెళ్తాడు అన్నది చూడాలి.
Also Read : Allu Arjun Rejected 10 Crores Offer : 10 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన పుష్ప రాజ్..!