Site icon HashtagU Telugu

Kalki : కల్కి ఆఫ్ స్క్రీన్ ప్రభాస్ స్టిల్.. రెబల్ ఫ్యాన్స్ ఖుషి..!

Kalki Off Screen Prabhas Still Goes Viral On Social Media

Kalki Off Screen Prabhas Still Goes Viral On Social Media

కల్కి కోసం ప్రభాస్ చేసిన సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్ ల కోసం చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా కల్కి (Kalki 2898AD) నుంచి ఒక బి.టి.ఎస్ స్టిల్ ఒకటి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కల్కి లో ఒక యాక్షన్ పార్ట్ కి సంబందించి రిహాల్సిల్ టైం లో ప్రభాస్ ఇచ్చిన స్టైల్ అది. ఇది చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

కల్కి కోసం ప్రభాస్ (Prabhas) పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మరో వెయ్యి కోట్ల సినిమాగా ఇది నిలిచింది. నాగ్ అశ్విన్ (Nag Aswin) డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె (Deepika Padukone) లాంటి బిగ్ స్టార్స్ నటించారు. సినిమాలో వారిని తీసుకున్న విధానం వారికి ఇచ్చిన పాత్రలు సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి.

కల్కి సినిమా ఆఫ్ స్క్రీన్ స్టిల్స్ మరికొన్ని రిలీజ్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కల్కి సినిమా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఈ సినిమా పార్ట్ 1 తో పాటు రెండో భాగానికి సంబందించిన 60 శాతం షూటింగ్ పూర్తైందని తెలుస్తుంది.

అన్ని అనుకున్నట్టు కుదిరితే మళ్లీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే కల్కి 2 కూడా రిలీజ్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కల్కి 2 కథ ఇంకా పెద్దగా ఉంటుందని. సినిమా తప్పకుండా మరోసారి ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. కల్కి 2 (Kalki 2) లో మరికొన్ని సర్ ప్రైజింగ్ క్యామియో రోల్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. సో కల్కి 1 ఎలా ఉందో దానికి రెండింతలు ఇంపాక్ట్ కలుగ చేసేలా కల్కి 2 ఉంటుందని చెప్పొచ్చు. నాగ్ అశ్విన్ అందుకే కల్కి 2 పై కూడా అంచనాలన్నీ ఆడియన్స్ ఊహలకే వదిలేశాడు.

Also Read : Indian 2 Climax : ఇండియన్ 2 క్లైమాక్స్ సర్ ప్రైజ్ అదేనా..?