Kalki 2898 AD : అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డు సృష్టించిన కల్కి

గతంలో 'సలార్: సీజ్‌ఫైర్' రూ. 12.11 కోట్లు, 'RRR' మూవీ పేరిట ఉన్న రూ. 10.57 కోట్లు రికార్డును కల్కి బ్రేక్ చేసింది

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 09:03 PM IST

ఉదయం నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి (kalki 2898 AD ) మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న కల్కి పేరే మారుమోగిపోతుంది. విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడం తో మేకర్స్ తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ ఇలా ఎంతో మంది ఈ మూవీ లో నటించి మెప్పించగా రాజమౌళి , సల్మాన్ దుల్కర్ , విజయ్ దేవరకొండ , వర్మ వంటి వారు ప్రత్యేక పాత్రలో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా అంత భావిస్తున్నారు. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే మొదటి రోజు రూ. 16.20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ‘సలార్: సీజ్‌ఫైర్’ రూ. 12.11 కోట్లు, ‘RRR’ మూవీ పేరిట ఉన్న రూ. 10.57 కోట్లు రికార్డును కల్కి బ్రేక్ చేసింది. ఇక ఈ చిత్రం ఫస్ట్ డే 200 కోట్ల నుంచి 230 కోట్ల మధ్య వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.

Read Also : Ramoji Rao Memorial Program : రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి – సీఎం చంద్రబాబు