Kalki 2898 AD Talk : కల్కి – చివరి 20 నిమిషాలు ప్రభాస్ బీభత్సం

ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి

  • Written By:
  • Updated On - June 27, 2024 / 11:11 AM IST

ఎప్పుడెప్పుడు చూద్దామా..అని వెయ్యి కళ్లతో గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తున్న కల్కి (Kalki 2898 AD) మూవీ ..ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. బాహుబలితో వరల్డ్‌ వైడ్‌గా తన మార్కెట్‌ని పెంచుకున్న ప్రభాస్‌.. ఇప్పుడు కల్కి తో వరల్డ్‌ వైడ్‌గా మంచి ఫ్యాన్‌ బేస్‌ పెంచుకోవడం ఖాయం. ఇక సినిమా ఎలా ఉంది..? కథ (Kalki 2898 AD Story) ఏంటి..? ప్రభాస్ (Prabhas Kalki 2898 AD) యాక్షన్ ఏ రేంజ్ లో ఉంది..? బిగ్ బి , కమల్ , విజయ్ దేవరకొండ , సల్మాన్ దుల్కర్ , దీపికా , దిశా పటాని ఇలా భారీ కాస్ట్ & క్రూ తో దాదాపు రూ.700 కోట్ల తో నిర్మితమైన ఈ సినిమా ఎలా ఉందనేది..ప్రేక్షకులు ఏమంటున్నారనేది ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

Kalki 2898 AD Talk :

ఇండియాలో ఈరోజు ఉదయం ఆట తో కల్కి మేనియా మొదలైనప్పటికీ..అమెరికా లో అర్ధరాత్రి నుండి షోస్ పడడంతో సినిమా ఎలా ఉందనేది వారు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. భారతీయుల ఇతిహాసం మహాభారతంలోని కొన్ని అంశాలను కలియుగానికి లింక్ చేస్తూ.. శ్రీమహావిష్ణువు చివరి అవతారం కల్కి అవతరించే సమయంలో చోటు చేసుకునే పరిణామాలను ఊహిస్తూ నాగ్ అశ్విన్ ఈ మూవీ ని తెరకెక్కించారని అంటున్నారు.

మహాభారత యుద్ధంతో మూవీ మొదలవుతుందని.. ఇందులో అశ్వత్థామ రోల్‌ను ప్రత్యేకంగా చూపిస్తారు. ఆ యుగం నుంచి కలియుగంలోని 2898 ఏడీకి కథను నాగ్ అశ్విన్ తీసుకెళ్లాడు. సినిమా ప్రారంభమైన అర్ధగంటకు ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం కాస్త అభిమానుల్లో నిరాశ కల్పించింది. కానీ ప్రభాస్ ఎంట్రీ ని ఓ రేంజ్ లో చూపించడంతో అభిమానుల ఎదురుచూపులు తెరపడింది. అనంతరం విలన్ కమల్ హాసన్ ఎంట్రీ కూడా అదే స్థాయిలో ఇచ్చారట. ఇక సినిమా మొదటి 15 నిమిషాలు మాత్రం మిస్ కావొద్దని అభిమానులు కోరుతున్నారు. అమితాబ్, ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఆ రేంజ్ లో ఉన్నాయట. ఫస్ట్ హాఫ్ అంత కూడా క్యారెక్టర్ల ఎంట్రీ తో నడిపించేసరికి కాస్త బోరింగా అనిపిస్తుందని అంటున్నారు.

ఇక సెకండ్ హాఫ్ (Kalki 2898 AD Second Half) మాత్రం అరిపించాడని…ముఖ్యముగా చివరి 20 నిమిషాలు ప్రభాస్ బీబత్సం సృష్టించాడని అంటున్నారు. మొత్తం సినిమాకే క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఇలా అబ్బా ఏమన్నా ఉందపో ..అని ప్రతిఒక్కరు థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అంటరాని..ఆ రేంజ్ లో క్లైమాక్స్ ఉందని అంటున్నారు.

Read Also : Kalki 2898 AD Highlights : ‘కల్కి ‘ మూవీ హైలైట్స్ ..

ఇక పాత్రల (Kalki 2898 AD Characters) విషయానికి వస్తే..

సినిమాలో ప్రభాస్ పాత్ర కంటే బిగ్ బి పాత్ర ఎక్కువగా ఉంది. ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీపిక ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హసన్‌ రోల్ చిన్నదే అయినప్పటికీ ఉన్నంత సేపు ఆ పాత్ర ప్రజెన్స్ తెర మీద కనిపిస్తుంది. వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది.

ఇక టెక్నీకల్ (Kalki 2898 AD Technical Team) విషయానికి వస్తే..

సినిమాటోగ్రఫి, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ పనితీరు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫి ఇలా అన్ని భాగాలూ అదుర్స్ అనిపించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ వారు ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గలేదు..వారు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓవరాల్ గా కల్కి తో ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ కి వెళ్ళింది.

Read Also : Kalki 2898 AD : ‘కల్కి’ టీం కు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ