Kalki 2898 AD Highlights : ‘కల్కి ‘ మూవీ హైలైట్స్ ..

"క్లైమాక్స్​లో ఓ సర్​ప్రైజ్ సాంగ్ ఉంటుంది. సెకెండాఫ్​లో దాదాపు 80 శాతం యాక్షన్​ సీన్సే ఉంటాయి. ఇక మూవీ స్టార్ట్​ అయిన 20-22 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది బెస్ట్ ఇంట్రో సీన్ అని నా అభిప్రాయం"

  • Written By:
  • Publish Date - June 26, 2024 / 09:07 PM IST

కల్కి..కల్కి ..కల్కి ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు మారుమోగిపోతుంది. గత మూడు నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సినీ సందడే లేకుండా అయిపోయింది. మాములుగా సమ్మర్ లో సినీ సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల మూలాన సినిమాలు రిలీజ్ లేక థియేటర్స్ మూతపడ్డాయి. ఇక ఇప్పుడు కల్కి తో అసలైన సినీ సందడి మొదలుకాబోతుంది.

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రేపు (జూన్ 27) రిలీజ్ కాబోతుంది. బాహుబలితో వరల్డ్‌ వైడ్‌గా తన మార్కెట్‌ని పెంచుకున్న ప్రభాస్‌.. వరల్డ్‌ వైడ్‌గా మంచి ఫ్యాన్‌ బేస్‌ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కల్కి తో హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తాడని అంత అనుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే అన్ని థియేటర్స్ లలో మూడు రోజులకు గాను టికెట్స్ అమ్ముడయ్యాయి..ఇక మరికాసేపట్లో కల్కి మేనియా మొదలుకాబోతుంది. ఈ తరుణంలో ఈ సినిమా హైలైట్స్ బయటకు వచ్చి అభిమానుల్లో మరింత ఆసక్తి నింపుతున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్​తో కలిసి ఇన్​స్టాగ్రామ్​ వేదికగా లైవ్ వచ్చారు. ప్రభాస్​తో ముచ్చటించిన ఆయన ఫ్యాన్స్​ కోసం సూపర్ అప్డేట్స్​ను షేర్ చేశారు. “క్లైమాక్స్​లో ఓ సర్​ప్రైజ్ సాంగ్ ఉంటుంది. సెకెండాఫ్​లో దాదాపు 80 శాతం యాక్షన్​ సీన్సే ఉంటాయి. ఇక మూవీ స్టార్ట్​ అయిన 20-22 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది బెస్ట్ ఇంట్రో సీన్ అని నా అభిప్రాయం”అంటూ నాగ్ చెప్పుకొచ్చారు.

ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్​, విజయ్​దేవరకొండకు ఇదే లైవ్​లో స్పెషల్ థ్యాంక్స్​ చెప్పారు. దీంతో నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో వాళ్లిద్దరూ కూడా ఉన్నారంటూ రివీల్ చేశారు. ఇప్పటివరకు ఈ మూవీ లో బిగ్ బి , కమల్ హాసన్ లు మాత్రమే అనుకున్నారు కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ , సల్మాన్ లు ఉన్నట్లు తెలియడం తో ఫ్యాన్స్ మరింత హ్యాపీ గా ఉన్నారు.

Read Also : Kalki 2898 AD : ‘కల్కి’ టీం కు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ